విస్డం హైస్కూల్లో ఘనంగా యోగ డే వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విస్డం హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులచే యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఏరోబిక్స్ నిర్వహణ జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, శారీరక, మానసిక ఆధ్యాత్మిక సామర్ధ్యాన్ని పెంచి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి యోగాను మించిన సాధనo మరొకటి లేదని మానసిక ప్రశాంతతకు యోగాభ్యాసం చాలా అవసరమని, శ్వాసని మెరుగుపరచడంలో యోగా చాలా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకి యోగ ఒక దినచర్యగా మారాలని దీని ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు యోగ 2025 ఆకృతిలో కూర్చుని అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎద్దండి నివేదిత రెడ్డి యోగ శిక్షకులు మచ్చ దేవదాస్, హర్ష మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



