ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో పెద్ద చెరువు నుండి రాయికల్ పట్టణ ఫిల్టర్ బెడ్ వరకు నీటిని తరలించే క్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లో లీకేజ్ కారణంగా, మరమ్మత్తుల కోసం చెరువుకు వెళ్లే మార్గంలో పెద్ద పెద్ద గుంతలు తీసి, ప్రమాద సూచికలు లేకుండా లోతైన గుంతలు తీసి పెట్టారు. కానీ సమీప కాలనీ ప్రజలు,చేపల వేటకు వెళ్లే గంగ పుత్రులు నిత్యం అవసరాల కోసం చెరువు వద్దకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున అధికారులు ఈ విషయాన్ని గమనించి మరమ్మతులు చేసే పని వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని కాలనీ ప్రజలు కోరుచున్నారు. ఈ విషయమై కాలనీ సభ్యుడు గుర్రం స్వామి మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఇలాంటి మరమ్మతులు పని జరిగేటప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.



