కోరుట్ల

వీడిన హత్య కేసు మిస్టరీ

viswatelangana.com

October 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్ పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు వివరాలు తెలుపుతూ తేదీ 01/10/20 24 రోజున కథలాపూర్ పోలీస్ స్టేషన్ నందు చింతకుంట గ్రామానికి చెందిన నేతుల రాజ మల్లయ్య అనే వ్యక్తి అతని తమ్ముడు నేతుల మల్లేశం దుంపేట గ్రామ శివారులోని వరద కెనాల్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో అతడి బైకుపడి ఉండి కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి కోరుట్ల సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో అనుమానస్పద స్థితిలో కనబడకుండా పోయినటువంటి నేతుల మల్లేశం యొక్క ఆచూకీ కొరకు స్పెషల్ టీములుగా ఏర్పడి అతని ఆచూకీ కొరకు ఆరా తీస్తుండగా తేదీ 4/10/2024 రోజున నేతుల మల్లేశం యొక్క మిస్సింగ్ కు అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేతల మల్లేశం యొక్క బావమరిది అయినటువంటి భూషణరావుపేటకు చెందిన భూపతి గంగారామును మధ్యాహ్న సమయం లో కథలాపూర్ పోలీసు వారు అదుపులోకి తీసుకొని విచారించగా అట్టి విచారణలో భాగంగా భూపతి గంగారం అను వ్యక్తీ నేతుల మల్లేశం యొక్క హత్యకు గల కారణాలను ఈ విధంగా తెలిపినారు ” నేతుల మల్లేశం అనునతను 2015 సంవత్సరంలో అతని సొంత కొడుకు అయిన ఆరు సంవత్సరాల బాబును బావిలో పడేసి చంపిన కేసులో 7 సంవత్సరాలుజైలు శిక్ష అనుభవించి గత సంవత్సరం క్రితం జైలు నుంచి విడుదలై తిరిగి ఇంటికి వచ్చి మళ్లీ గంగారం యొక్క చెల్లె లావణ్యను మరియు కోడలును వేధిస్తూ వాళ్ళను కూడా చంపుతా అని బెదిరించడంతో గంగారాం కి అతని బావ మల్లేశం బతికుంటే ఎప్పటికన్నా అతని చెల్లె లావణ్య ని మరియు ఆతని కోడలు నీ చంపుతాడు అని భావించి మల్లేశం నీ చంపేయాలని సిద్దపడినాడు ఈ క్రమం లో తేది 01/10/2024 రోజున ఉదయం సమయంలో గంగారం, నేతుల మల్లేశం కి ఫోన్ చేసి ఇంట్లో పెద్దలకి బియ్యం ఇచ్చుకునేది ఉంది కల్లు తాగుదాం అని చెప్పి అతనినీ ఇంటికి పిలిపించుకొని అక్కడ అతనికి కళ్ళు తాగిపించి అక్కడి నుండి మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ గుడి వద్ద దావత్ ఉందని చెప్పి మల్లేశంను తనతో పాటు తీసుకొని వెళ్లి అక్కడ మల్లేశంకి బాగా తాగిపిచ్చి మళ్ళీ రాత్రి సమయంలో తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో మధ్యలో మళ్లీ మందు తీసుకొని గంగారం మరియు మల్లేశంలు దుంపెట గ్రామ శివారు లోని వరద కెనాల్ బ్రిడ్జి వద్దకు వచ్చి అక్కడ మళ్ళీ మందు తాగి నారు అయితే మల్లేశం బాగా మందు తాగిన స్థితిలో ఉండగా ఇదే అదనుగా భావించి గంగారం పక్కన ఉన్న బoడరాయితో మల్లేశం యొక్క తలపై మోది అతని తలను బ్రిడ్జికి గోడకు బలంగా గుద్దడం వలన అతను చనిపోయినాడు అని నిర్ధారించుకొని అతని యొక్క బాడీని వరద కెనాల్ నీటిలో పడవేసి అతను బండిని రోడ్ యాక్సిడెంట్ అయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నంలో వరద కెనాల్ పక్కన పడవేసి అక్కడి నుంచి పారిపోయినాడు.హత్యకు గురికాబడిన నేతుల మల్లేశం యొక్క డెడ్ బాడీని వరద కెనాల్ వెంబడి గాలింపు చర్యలు చేపడుతుండగా మేడిపల్లి మండలంలోని విలయతాబాద్ గ్రామంలో గల వరదకెనాల్లో ఒక డెడ్ బాడీ నీళ్ళల్లో పైకి తేలుతున్నదని సమాచారం మేరకు అక్కడికి పోలీస్ సిబ్బంది మృతుడి కుటుంబీకులతో పాటు వెళ్లి అట్టి డెడ్ బాడీ నీ బయటకు తీసి చూడగా అది నేతుల మల్లేశం యొక్క మృతదేహంగా గుర్తించినారు. ఇట్టి హత్యకు కారణమైనటువంటి భూపతి గంగారంను తేదీ 05/10/2024 రోజున కోర్టులో హాజరు పరిచి రిమాండు కు పంపనైనది. మరియు ఇట్టి హత్య కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తూ గంగారాం తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టడమైనది. మరియు ఇట్టి హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల సీఐ సురేష్ బాబు ని మరియు కథలపూర్ ఎస్సై నవీన్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.

Related Articles

Back to top button