వీరశైవ లింగాయత్ లింగ బలిజ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయంజిల్లా సంఘం సభ్యులు మాణిక్యం గంగాధర్

viswatelangana.com
రాష్ట్ర వీర శైవ లింగ యాత్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల జగిత్యాల జిల్లా వీర శైవ లింగాయత్ నాయకులు మాణిక్యం గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు ఇట్టి సందర్భంగా అయన మాట్లాడుతు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నా కార్పొరేషన్ ను , నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే, వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు నిర్ణయించడం అభినందనీయం, రాష్ట్ర వ్యాప్త వీరశైవ లింగాయత్ లింగ బలిజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులకు , జగిత్యాల జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తరపున ధన్యవాదాములు తెలియచేస్తున్నాము అని అధికారం వచ్చిన వంద రోజుల్లో సుస్థిరమైన ప్రజా పాలన ఏర్పాటు దిశగా అడుగులు వేస్తూ, చారిత్రక నిర్ణయం తీసుకొని బీద వీరశైవ లింగాయత్ లింగ బలిజల సంక్షేమానికి దోహద పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజలు సర్వదా రుణపడి ఉంటారని గంగాధర్ తెలిపారు .



