కోరుట్ల

వెంకటాపూర్ లో పండగలా భూమి పూజలు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు

viswatelangana.com

June 8th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు వాళ్ళ బంధువులు, మిత్రులు అలాగే కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో భూమి పూజలు నిర్వహించు కోవడం జరిగింది.. ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మా లాంటి పేద వాళ్ళ సొంతింటి కలను నిజం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ, సంపూర్ణ తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి వర్గం, జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణా రావు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సత్యం రావు అలాగే గ్రామ ఇందిరమ్మ కమిటీకి, గ్రామ కాంగ్రెస్ నాయకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రజా సంక్షేమం, కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జువ్వాడి సోదరులకు ధన్యవాదములు తెలిపారు.. కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి సోదరులు చేస్తున్న అభివృద్ధి తద్వారా ప్రజల్లో వారికి పెరుగుతున్న మద్దతు చూసి ఓర్వలేక, కొందరు పని గట్టుకుని విషం చీమ్ముతున్నారని ఇది సబబు కాదని, ప్రజానీకానికి అన్ని స్పష్టంగా అర్థం అవుతున్నాయి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బర్కం నర్సయ్య, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టీ బాబు, ఆలయ కమిటీ ఛైర్మెన్ కటుకం రాజేష్ నేత, ఇందిరమ్మ కమిటి సభ్యులు మాజీ ఉప సర్పంచ్ విట్టల రవీందర్ రెడ్డి, ద్యాగ గంగాధర్, ముహమ్మద్ నబి, బలుసు నారాయణ, వన్నెల రాజ్ కుమార్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రసత్ పాషా, కాంగ్రెస్ బూత్ ఎన్రోలర్ పిట్టల రమేష్, బర్కం రాజేందర్, బలుసు రాజి రెడ్డీ, యూత్ కాంగ్రెస్ నాయకులు ముహమ్మద్ నసీర్, బండ్ల రమేష్ అలాగే తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Back to top button