తెలంగాణ ప్రభుత్వానికి పాలాభిషేకం

viswatelangana.com
కథలాపూర్ మండల కేంద్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా యాదవ- కురుమ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల మంత్రి వర్యులకి, వేములవాడ అభివృద్ధి ప్రదాత, శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ లకు బడుగు బలహీన సబ్బండ వర్గాల పక్షాన, గొల్ల, కుర్మ యాదవ- కురుమ సామాజిక వర్గం పక్షాన పాలాభిషేకం చేసి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపారు తొట్ల అంజయ్య యాదవ్ టీపీసీసీ కార్యవర్గ సభ్యులు అధ్వర్యంలో కథలపూర్ మండల కేంద్రంలో మా యాదవుల పక్షాన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయతి నాగరాజు, వంగ మహేష్ యాదవ్, అంజన్న యాదవ్, మధు, కుంభం మహేష్, మేకల మల్లేష్ యాదవ్ ఆల్లూరు దేవరెడ్డి అనంతరెడ్డి రాజు యాదవ్, యాదవ కులస్తులు తదితరులు పాల్గొన్నారు



