మేడిపల్లి

వెంటనే రైతులను ఆదుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నాలు చేస్తాము

viswatelangana.com

May 19th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండలంలొని కట్లకుంట గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నా రైతుల సమస్య లు అడిగి తెలుసుకున్న బిజెపి వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి డా. చెన్నమనేని వికాస్. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మ్యాచర్ వచ్చి రోజులు గడుస్తున్న కొనుగోలు చేయడం లేదని వెంటనే సంబంధిత అధికారుల తో మాట్లాడి సమస్య ను పరిష్కరించాలని కోరారు. తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారు రైతులను మోసం చేస్తున్నారు. రైతు భరోసా, క్వింటాల్ కి 500 బొనస్, 2లక్షల రుణ మాఫీ చేస్తాం అని చెప్పి మోసం చేశారు అన్నారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదు ప్రభుత్వా వైఫాల్యం అని అన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ధర్నలు రాస్తా రోకోలు చేస్తాం అనీ హెచ్చరించారు. వరి ధాన్య కేంద్రాలను పరిశీలించారు. వారీ వెంట బిజెపి మండల అద్యక్షులు ముంజ శ్రీనివాస్, దశరథ రెడ్డి, ఎస్ ఎన్ రెడ్డి, మండల బిజెపీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button