కోరుట్ల

వైద్యుల నిర్లక్ష్యం తో వ్యక్తి మృతి

viswatelangana.com

May 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణానికి చెందిన ముజ్జు అనే వ్యక్తి చికిత్స నిమిత్తం కోరుట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా సకాలంలో డాక్టర్ లు అందుబాటులో లేక ముజ్జు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. వైద్యులు అందుబాటులో లేకనే చనిపోయాడంటూ ప్రభుత్వ ఆసుపత్రి లో బంధువులు ఆందోళన చేశారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి ప్రభుత్వం ఒక వైపు వైద్య సేవలు సామాన్యులకు అందించాలని చెబుతుంటే వైద్యులు మాత్రం ఆసుపత్రి కి వచ్చినా రోగులకు అందుబాటులో లేకపోవడం పై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు సమయపాలన పాటించని వైద్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులు కోరుతున్నారు.

Related Articles

Back to top button