కోరుట్ల
వైభవంగా చల ప్రతిష్ట మహోత్సవం

viswatelangana.com
April 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాం పుర కాలనీలోని భక్తఆంజనేయ స్వామి దేవాలయం లో సీతా రామచంద్ర మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాల చల ప్రతిష్ట మహోత్సవం ఆదివారం నాడు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు . ఈ కార్యక్రమం లో భాగంగా పుణ్యహవచనం, గౌరి, గణపతి పూజ, సర్వతో భద్ర మండల, యోగిని, వాస్తు, నవగ్రహ, కలష స్థాపన మరియు జల, పుష్ప, దాన్య, శయ్యాధి వాసలు అదేవిదంగా స్థాపిత దేవతా హోమాలు ,సీతా రాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయ కమీటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమం లో ఆలయ కమీటీ సభ్యులు దురిశెట్టి సత్య నారాయణ, ప్రశాంత్, కిరణ్ కంచె కుమార స్వామి, విలాసాగర్ రవి, పెడిమల్ల రాజు, నడిగడ్డ రాజు, మనోహర చారీ, రాజేంద్ర ప్రసాద్, ప్రభు, భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.



