శాసన సభ సమావేశాల జీరో అవర్ లో కోరుట్ల నియోజకవర్గ సమస్యను సభలో లేవనెత్తిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ మా నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో ప్రభుత్వం తదనంతరం ప్రవేట్ పరం అయ్యింది. కేసీఆర్ 2014 – 15 లో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీ పై అధికారం రైతులకే ఇద్దాం అని ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం కమిటీ వేస్తాం అన్నారు. గతంలో దివంగత ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ని కానీ ప్రస్తుతం నన్ను ఎమ్మెల్యేగా ఈ కమిటీలో చేర్చలేదు. మా తండ్రి విద్యాసాగర్ రావు కూడా చెరుకు రైతుల పక్షాన నిరాహార దీక్ష చేశారు. భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించాలి.. అక్కడి చెరుకు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కమిటీ లో ఎమ్మెల్యే గా నాకు స్థానం కల్పించాలి. భవిష్యత్తు లో రైతాంగ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పరిశ్రమల శాఖ మంత్రి గారు త్వరగా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.



