రాయికల్
శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాల సమర్పణ

viswatelangana.com
June 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు మహిళలు పురవీధుల గుండా బోనాలతో తరలి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శివాజీ రైతు యువజన సంఘం అధ్యక్షులు కురుమ సుదర్శన్ రెడ్డి ఉపాధ్యక్షులు కురుమ నారాయణరెడ్డి, కోశాధికారి పటేల్ గోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ధమ్మ మోహన్ రెడ్డి, కుంభాల సంతోష్ రెడ్డి, పడిగెల కిషోర్ రెడ్డి, పటేల్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



