రాయికల్
శివ జాగరణలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

viswatelangana.com
March 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామ నాగాలయంలో శివ జాగరణలో భాగంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. వేలాదిమంది భక్తులు తరలివచ్చి శివ జాగరణలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో రాయికల్ విస్డం హై స్కూల్, గ్రీన్ వుడ్ హై స్కూల్, ఒడ్డెర కాలనీ, కొత్తపేట ప్రాథమిక, హైస్కూల్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.



