రాయికల్
బస్సు సౌకర్యం కల్పించాలని ప్రత్యేక అధికారికి వినతి పత్రం

viswatelangana.com
June 18th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ మంగళవారం ప్రత్యేక అధికారికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాయికల్ నుంచి కట్కాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు అధికారులు స్పందించి కట్కాపూర్ – రాయికల్ బస్సు సౌకర్యం కల్పించాలని లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు సుజాత భాగ్యలక్ష్మి శారిక లావణ్య జల లక్ష్మి, భాగ్య పర్వీనా బేగం రజిత తదితరులు పాల్గొన్నారు



