కొడిమ్యాల

భూ భారతి చట్టం ప్రతీ పేదోనికిపట్టంమనీచొప్పదండి ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం అన్నారు

viswatelangana.com

April 24th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో ఎల్ కె. గార్డెన్లో నిర్వహించిన భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై మండల అధికారులు రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈసేవలు ప్రారంభమవుతాయని భూభారతి చట్టం ప్రతి ఒక్కరికీ న్యాయం చేయగలిగే విధంగా ఉందని తెలిపారు కొడిమ్యాల , మండల సంబంధించిన భూభారతీ అవగాహన సందర్భంగా ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రారంభించిందని అన్నారు. చాలామంది రైతులు భూ సమస్యలపై కోర్టులు ఆశ్రయించాల్సి వచ్చిందని, ఈ భూభారతి చట్టంలో ఇచ్చిన అంశాలపై రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు కిందిస్థాయి నుండి పై స్థాయికి వెళ్తే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ భూభారతి చట్టం తీసుకువచ్చిందని సన్న,చిన్నకారు రైతులకు కూడా ఈ చట్టంలో న్యాయం జరుగుతుందని వారసత్వ పట్టాలు సులభంగా జరుగుతాయని, వారు రైతులకు అవగాహన కల్పించారుభూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సరకాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు గతంలో ధరణి అంటేనే దరిద్రం అని, ధరణి అంటేనే కల్వకుంట్ల కుటుంబం అనీ,కల్వకుంట్ల కుటుంబం కోసమే సృష్టించుకున్నది ధరణి పోర్టల్ అనీ,ధరణి అనేది పేదవాడికి ఇది ఉపయోగకరం గా ఉండేది కాదని,భూ భారతి చట్టం అంటే ప్రతీ పేదోనికి చుట్టమని అన్నారు ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సైతం ఎలాంటి లోపాలున్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారుఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్, ఎంపీడీవో స్వరూప, వ్యవసాయ అధికారిని పి జ్యోతి, సీఐ నీలం రవి, ఎస్ఐ సందీప్, సిబ్బంది నాయకులు కార్యకర్తలు,రైతులు,తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button