శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న దేవదాయ శాఖ కమిషనర్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గ్రామం నల్లగొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవస్థానల సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ నాయని సుప్రియ, కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శనం చేసుకొని దేవస్థానంకు సంబంధించిన భూములను పక్కనే ఉన్న రైతులు ఆక్రమించిన భూములను పరిశీలించి అక్రమణ దారులను పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇది దేవస్థానం నకు చెందిన భూమి ఇందులో సాగు చేయటం తప్పు సాగు చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ దేవస్థానం భూమి హద్దులు దాటి చేస్తే ట్రాక్టర్ ద్వారా చెడగొడతాము అని హెచ్చరించినారు. తర్వాత వనమహోత్సవ కార్యక్రమంలో శ్రీయుత సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మదాయ శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీమతి నాయిని సుప్రియ, పాల్గొని గుట్టపైన పార్కింగ్ ప్లేస్ లో 200 చెట్లు నాటరు ఇందులో స్థానిక ఎస్సై సందీప్,దేవదాయ ధర్మాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకు శ్రీ యం. రాజమౌళి, దేవస్థానం కార్యనిర్వాణాధికారి వీ. వెంకన్న, స్థానికులు చెన్నాడి రమాపతి రావు, మాజీ సర్పంచ్ మల్లేశం, అర్చకులు కే శ్రీనివాసచార్యులు, రజనీకాంత్ చార్యులు, మనోజ్ కుమార చార్యులు, జూనియర్ అసిస్టెంట్లు కే కమలాకర్, జి రవి ఆలయ సిబ్బంది మహేష్ రమేష్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.



