శ్రీ లలితాంబిక శక్తిపీఠంలో వైభవంగా దివ్య పుష్పయాగం

viswatelangana.com
పౌర్ణమిని పురష్కరించుకొని రాయికల్లోని శ్రీ లలితాంబిక శక్తిపీఠంలో శ్రీ రామకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో శ్రీ లలితాంబికకు దివ్య పుష్పయాగాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. వేలాది సువాసనగల రంగురంగుల పుష్పాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. శ్రీమహాలక్ష్మీ గణపతి, గాయత్రీ అమ్మవారికి, శివలింగంకు, పంచముఖ ఆంజనేయ స్వామికి, దక్షిణామూర్తి, దత్తాత్రేయస్వామిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా శ్రీ లలితాంబికాదేవికి వివిధ రకాల పుష్పాలతో కన్నుల పండువగా పుష్ప యాగం నిర్వహించారు. పుష్ప యజ్ఞం అనేది శ్రీ లలితాంబికా దేవికి అంకితం చేయబడిన ఒక గొప్ప పుష్ప సమర్పణ కార్యక్రమమని శ్రీరామకృష్ణ గురూజీ ఉద్భోదించారు. ఈ పవిత్ర ఆచారం దైవతల్లికి పూర్తిగా లొంగిపోవడాన్ని సూచిస్తుందన్నారు. ప్రతి పువ్వు హృదయపూర్వక ప్రార్థన, ప్రగాఢ కృతజ్ఞతను సూచిస్తుందని తెలిపారు. లలితామ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. అనంతరం పుష్పయజ్ఞం కార్యక్రమానికి హాజరైన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు.



