viswatelangana.com
Date of Publish : 02 March 2025, 12:36 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
శ్రీ వల్లభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో ఆదివారం శ్రీ వల్లభా చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఆయుర్వేద శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బద్దం రాజేందర్, డాక్టర్ ఎం.ఎ రఫీ, కైరోప్రాక్టర్ గంప నరేష్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ చెరుకుపల్లి రాజేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు బోగ రవికుమార్, జిల్లా అధ్యక్షులు ముక్క దాము, జిల్లా ఉపాధ్యక్షులు సంపెట మల్లయ్య, జిల్లా కార్యదర్శి తుమ్మనపల్లి మహేష్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ అడువాల ప్రభాకర్, కోరుట్ల టౌన్ ఇంచార్జీ ఆడువాల స్వరూప, కటికె రాజ్ కిషన్, అడ్లగట్ల వెంకటేశం, చిద్రాల రాములు, సిహెచ్ నాగేందర్, రాజవరపు కృష్ణ , కటికె మోహన్ , అల్లె రవి, నల్ల శంకర్, తోట రాజు, గొనె శ్రీహరి, కైరంకొండ రాజగంగాధర్, గొనె మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type