కోరుట్ల
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

viswatelangana.com
April 6th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఆలస్యమైనప్పటికీ ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చి దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసేలా ప్రణాళికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ తన పాని తాను చేసుకుంటూ వెళుతుంది ఎలాంటి ప్రచారాలకు తావివ్వదు అవినీతి, అక్రమాలకు చోటు ఇవ్వదు ఒక నాయకుడు ఎదిగాక తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఈ పార్టీలో పార్టీని నమ్ముకుని జెండా మోసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిమిషాకవి నవీన్, వెంకట్ రెడ్డి రాజు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



