కోరుట్ల
స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు నాలుగవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

viswatelangana.com
May 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో స్వర్గీయ రత్నాకర్ రావు నాలుగో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అభివృద్ధి పథంలో నడిపిన రత్నాకర్ రావు కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జి శ్రీ గద్దె నరహరి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల శ్రీధర్, బీసీ యువజన సంగం జిల్లా అధ్యక్షులు చిలివేరి దిలీప్ గౌడ్, యూత్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిఏలేటి మహిపాల్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ పటేల్, మూడవ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.



