కోరుట్ల
శ్రీ సీతారామచంద్రులకు పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి కృష్ణారావు దంపతులు

viswatelangana.com
April 6th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ సాయిరామ నది తీరాన శ్రీరామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు విజేత దంపతులు పాల్గొని శ్రీ సీతారామచంద్ర ప్రభువును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవానికి సంబంధించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.



