శ్రీ సీతారాముల కళ్యాణం లో పాల్గొనండి సకల సమస్యల నుండి విముక్తి పొందండి

viswatelangana.com
కోరుట్ల పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన శ్రీ సీతారామాలయం లో ప్రతి యేటా శ్రీ సీతారాముల కళ్యాణం నిత్య నూతనంగా వైభవోపేతంగా నిర్వహించడం ఇక్కడ కోరుట్ల పట్టణ ప్రజల ఆలయ కమిటీ ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనల మేరకు భక్తుల సౌకర్యార్థం మేరకు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కోరుట్ల పుర ప్రముఖుల, కుల, యువజన సంఘాల నేతృత్వంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. శ్రీ రామ నవమి వేడుకలను పురస్కరించుకొని అఖిల భారత దండి పీఠాధిపతి తెలంగాణ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కోరుట్ల పట్టణంలోని శ్రీ సీతా రామాలయంలో ఈ సంవత్సరం మొదటి సారిగా వసంత నవరాత్రోత్సవములు శతరుద్ర సహిత శత చండీ యాగ మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా జరుపాలని ఆలయ కమిటీ అధ్యక్షులు నూతన సభ్యుల నేతృత్వంలో నిశ్చయించారు. ఈ వేడుకలకు పీఠాధిపతులు నాగ సాధువులు ప్రముఖ ప్రవచకుల ఆద్వర్యంలో మార్చి 30వ తేదీ ఆదివారం రోజు నుండి ఏప్రిల్ 4 సోమవారం రోజు వరకు ఆలయ కమిటీ, కోరుట్ల పట్టణ ప్రజల సమన్వయంతో అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశామన్నారు. సభ్యులందరూ కలిసి విడుదల చేశారు.



