కథలాపూర్
ఎస్ ఎస్ సి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాళ్లకు సన్మానం

viswatelangana.com
March 8th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
బొమ్మెన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. కష్టపడి, ఇష్టంతో చదివితే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని హెచ్ ఎం టి. మధు కుమార్ అన్నారు. 10 సం. లుగా పాఠశాల తో తమకు గల అనుబంధాన్ని విద్యార్థులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ ఎం రవి,రాజేష్, వెంకటేష్,ఉపాద్యాయులు సవిత,రాజేష్, వెంకటేష్,శ్రీధర్ కుమార్ , అరుణ, రమేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదే కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళ ఉపాద్యాయులను ఘనంగా సన్మానించుట జరిగింది.



