కోరుట్ల
సంబురంగా సద్దుల బతుకమ్మ

viswatelangana.com
October 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో పేర్చి అందంగా బతుకమ్మలను వివిధ రూపాల్లో తయారు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ లను పట్టుకొని ఆడుతూ పాడుతూ అంబేద్కర్ నగర్ పూల్ వాగు వరకు చేరుకొని వాగు లో నిమజ్జనం జరిపారు. మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చుకున్నారు.



