రాయికల్
బూత్ అధ్యక్షునిగా బోయిని నరేందర్

viswatelangana.com
April 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేట గ్రామ (బూత్ ) అధ్యక్షునిగా బోయిని నరేందర్ ను ప్రకటించిన బీజేపీ మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు. నరేందర్ మాట్లాడుతూ ఇట్టి నియామకానికి సహకరించిన బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల మహేష్, మండల ఉపాధ్యక్షుడు కోలా శంకర్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు ఆనంద్, బూత్ అధ్యక్షులు నాగరాజు, గంగారెడ్డి, నాయకులు భూమేష్, విష్ణు, రాజు, రమేష్, శ్రీనివాస్, తిరుపతి, గంగస్వామి, నరేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



