కథలాపూర్
సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలి – మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ

viswatelangana.com
July 6th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాలలో మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ పాల్గొని అమ్మవారికి బోనం ఎత్తుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భైర హేమలత – మల్లేష్, కాటిపల్లి పెద్ద భూమరెడ్డి, లోక నర్శ రెడ్డి, కట్ట శంకర్, బజాజ్ మహేష్ తదితరులు ఉన్నారు.


