మెట్ పల్లి

సఖీ కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన

viswatelangana.com

September 4th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన “సఖీ కేంద్రం “వారు మహిళలపై జరుగుతున్న హింస మరియు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ మొబైల్ ఫోన్ వాడకం తగ్గించుకొని, కళాశాలకు ప్రతిరోజు వస్తూ అధ్యాపకులు చెప్పినటువంటి పాఠాలను శ్రద్ధగా విని మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడ్వకేట్ లావణ్య నేడు సమాజంలో జరుగుతున్న నేరాలు చట్టాల గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్, సఖి కేంద్రం వారు గౌతమి స్వప్న మరియు అధ్యాపకులు జగపతి, శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య, సుదర్శన్,ప్రతిభ మంజుల, కిరణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button