కొడిమ్యాల

సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

viswatelangana.com

April 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యల మండల కేంద్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు గురువారం కొడిమ్యాల మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని గత 10 సంవత్సరాలలో లేని అభివృద్ధి పనులు ఏడాది కాలంలో చేపట్టాం అని మీ ఆశీర్వదాలు ఉంటే రాబోవు 4 సంవత్సరాలలో మరింత అభివృద్ధి సాధిస్తాం అని, సాగు నీరు ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అని ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి షరతులు లేకుండా ప్రజా క్షేత్రంలో పనిచేస్తున్నాం అని తెలిపారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ 30,03,480/- విలువగల 30 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు

Related Articles

Back to top button