రాయికల్

సన్మానం

viswatelangana.com

October 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉద్యోగ రీత్యా బదిలీపై వెళ్లాల్సిందేనని, వారు చెప్పిన మంచిని పిల్లలు శ్రద్ధతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామాల్ల వేణు, కటిపెల్లి గంగారెడ్డి,కంటి విష్ణు, గ్రామ సేవా సమితి అధ్యక్షులు నల్లగంగారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చందా రాధ, అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఆయాలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button