
viswatelangana.com
October 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చెన్నవేని నమిలి – భూమయ్య దంపతుల కుమారుడు చెన్నవేని సాగర్ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ 2024 ఫలితాలలో పిఈటి విభాగంలో ఓపెన్ కేటగిరిలో 7వ ర్యాంకు సాధించాడు. సాగర్ విద్యాభ్యాసం 7వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాల ఊట్ పల్లిలో, పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూషణరావుపేట లో, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో చదివాడు. సాగర్ కు ఒక అన్న శ్రీనివాస్, చెల్లెలు రాజేశ్వరి ఉన్నారు. సాగర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల మిత్రులు, గ్రామ ప్రజలు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



