రాయికల్
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు యోగా చేయాలి

viswatelangana.com
June 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని తన నివాసంలో యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించిన బిజెపి జగిత్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయిందనిపురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారని ఈ యోగాసనాల గొప్పదనం తెలుసు కాబట్టే విదేశీయులు సైతం యోగాసనాలను ఆచరిస్తున్నారని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు యోగా చేయాలని మనకి వచ్చే చాలా అనారోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు ఉన్నాయని ఎంతో మందికి వీటి గొప్పదనం తెలుసు కాబట్టే రోజూ యోగాసనాలు వేస్తున్నారని దీంతో యోగా ఖ్యాతీ ప్రపంచంలోని నలుదిక్కులకి పాకిందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు పాల్గొన్నారు



