మూఢనమ్మకాలను పారద్రోలడం లో సైన్స్ పాత్ర వెలకట్టలేనిది
viswatelangana.com
భూపాల్ పల్లి జిల్లాలో శనివారం రోజున జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో చిట్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రథమ స్థానం సాధించడానికి కృషిచేసిన గైడ్ టీచర్ సరళ దేవిని ప్రముఖులు ప్రశంసించారు. చిట్యాల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి సంజయ్, 9వ తరగతి విద్యార్థి హర్ష , 8వ తరగతి విద్యార్థి సునీల్ తయారుచేసిన ఆర్టికల్ రాష్ట్రస్థాయికి ఎంపిక అయింది. జిల్లా చైల్డ్ హెల్త్ మరియు ఇమ్ము నై జేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అన్వేషణీ మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని ఆశీర్వదించారు. జన విజ్ఞాన వేదిక వారు సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచరుగా పనిచేసిన సరళాదేవిని అభినందించారు ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వాయిస్ ప్రిన్సిపాల్ రాజేశం, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అన్వేషిని, మహా ముత్తారం ఎంపీడీవో ఆంజనేయులు, జిల్లా సైన్స్ ఆఫీసర్ స్వామి, మండల విద్యాధికారి దేవా జనవిజ్ఞాన వేదిక కన్వీనర్లు పాల్గొన్నారు.



