మేడిపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

viswatelangana.com
April 1st, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండలంలో గోవిందారం, మోత్కురావుపేట, మన్నెగూడెం గ్రామాలలో సోమవారం రోజున వల్లంపల్లి ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ మల్లారెడ్డి, సంఘ కార్యదర్శి గోపి, కొనుగోలు కేంద్ర, ఇన్చార్జులు, సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.



