అనుచిత వ్యాఖ్యలు తగదు

viswatelangana.com
ఇటీవల కొండ సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు తో కూడిన ఆడియోలు వీడియో లు మాధ్యమాల్లో పెట్టినటువంటి దానిని జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఇది సరైన పని కాదని మన దేశంలో స్త్రీని గౌరవించడమే మన సంప్రదాయం దాన్ని మరచి ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తున్నారు వాళ్లకు కూడా తల్లి ఉంటది కూతురు ఉంటది అక్క చెల్లెలు ఉంటారు కాబట్టి మీరు కూడా వెనుక ముందు ఆలోచన చేయాలని ఇది సరైనది కాదని దాన్ని పూర్తిగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఖండిస్తున్నదని ఇది ఒక బీసీ బిడ్డకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామని మునుముందు బీసీల బలమేందో చూపిస్తాం ఈ సందర్భంగా చెప్తున్నాం అనైతిక వీడియోలు చేస్తూ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే విధంగా ఉన్నవారు ఖబర్దార్ ఇట్లాంటి పరిణామాలు జరుగుతే అటు స్త్రీ సమాజం కూడా ఊరుకోదు ఇటు బీసీ బిడ్డలమైన మేం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ప్రతి వ్యక్తి గాని ప్రతి వ్యవస్థ కాని హెచ్చరిస్తున్నాం ప్రజా క్షేత్రలో గుణపాఠం చెప్పుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, సుధాకర్, శంకర్, రాజేష్, లింగారెడ్డి, తిరుపతి, సత్తన్న, గంగరెడ్డి దిటి పటేల్ తదితరులు పాల్గొన్నారు



