సర్వసభ్య సమావేశం

viswatelangana.com
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ భూపతిపూర్ గ్రామంలో సర్వ సభ్య సమావేశం అధ్యక్షులు ఏనుగు ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముత్యం రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘ పరిధిలో 100% రుణాలు రికవరి చేయాలని, రైతు పంట రుణ మాఫిలో 216మంది రైతులకు సంబంధించిన 1,55,29,940 రూపాయలు జమ చేయడం జరిగింది. కొందరు రైతులు దీర్ఘ కాలిక రుణాలు చెల్లించక పోవడం తో 100% రికవారికి దూరం అవుతుందని, అందరు రైతులు రుణాల పై వడ్డీ చెల్లించి రినీవాల్ చేసుకోగలరని, ఎరువుల కొనుగోళ్లు సంఘ పరిధిలోని గోదాముల్లో కొనుగోలు చేయలని, కొత్త పంట రుణాలు అందించాలని సమావేశం లో తీర్మానించారు. సహకార సంఘం వార్షిక నివేదిక 2023-2024 కార్యదర్శి ఎల్లాల చంద్రశేఖర్ సమర్పించారు. ఈ సమావేశం లో వైస్ చైర్మన్ నాగుల మల్లయ్య, డైరెక్టర్లు నేతుల లక్మి నారాయణ, కొమ్ము గంగరాజం, కొసరి మహేష్, నిమ్మల భారతి,శేఖర్ రెడ్డి, కేడిసిసి బ్యాంక్ మేనేజర్ మార్కండేయ, కార్యదర్శి చంద్రశేఖర్, సహకార సంఘ సిబ్బంది రాజేష్, రంజిత్ మరియు సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.



