కథలాపూర్

సర్వ సభ్య సమావేశం లో పలు సమస్యలపై ప్రశ్నించిన ప్రభుత్వ విప్ ఆది

viswatelangana.com

May 29th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఎంపిపి జవ్వాజి రేవతి అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిధి గా హాజరై ఆయా శాఖల అధికారులను ప్రశ్నించారు. వ్యవసాయ అధికారిణి యోగిత ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీలుగా విత్తనాలు సరిపడా వచ్చాయా? మండలానికి ఎన్ని క్వింటాళ్ళు అవసరమో మీకు తెలుసా? తాండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాల్లో ఒక్క రైతు ఆధార్ కార్డు పలువురికి అనుసంధానం చేయడం వల్ల రైతు బంధు డబ్బులు రావడం లేదని, రైతు భీమా వర్తించడం లేదని దీనికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అని అన్నారు. తహసీల్దార్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా చర్చించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. తాండ్రియాల ఎక్స్ రోడ్డు, తుర్తి, రాజారాం తండా గ్రామాల్లోనే రేషన్ సరుకులు అందించాలని తహసీల్దార్ కు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని, అదనపు తరగతి గదుల కోసం ఎలెక్షన్ కోడ్ పూర్తి అయిన వెంటనే నిధులు మంజూరు చేస్తానని అన్నారు. వర్షాకాలంలో మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని, గ్రామాల్లో మహిళలకు స్వయం ఉపాధి లో భాగంగా పలు కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని, ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవాల సంఖ్యను పెంచేలా తగిన ఏర్పాట్లు చెయ్యాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపిపి రేవతి, జెడ్పీటీసి నాగం భూమయ్య, వైస్ ఎంపిపి కిరణ్ రావు, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు బొడ్డు బాలు, ఎంపిటిసిలు పులి శిరీష, కొండ ఆంజనేయులు, వేముల గంగరాజాం, కో ఆప్షన్ సభ్యులు రఫీ,తహసీల్దార్ ముంతాజీబొద్దీన్, ఎంపీడీవో శంకర్, ఎంపివో ప్రవీణ్, ఎంఈవో ఆనందరావు, ఏవో యోగితా మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button