పదవ తరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని

viswatelangana.com
- వీడ్కోలు సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్…
పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాసి వందశాతం ఫలితాలను సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచిపేరు తేవాలని రామాజీపేట్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ అన్నారు. బుధవారం తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వీడ్కోలు పార్టీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మంచిగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీ, చదువును మధ్యలోనే ఆపివేకూడదని, చదువు, జ్ఞానంతోనే బంగారు బావి నిర్మితమవుతదని అన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో విద్యనే వజ్రాయుధం లాంటిదని, దేశభక్తి, జాతీయ భావాలు కలిగి దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్, సీనియర్ ఉపాధ్యాయులు తెనుగు రమేష్, సతీష్ కుమార్, శ్రీనివాస చారీ, విజయ్, బూసి రమ, అంజుం బేగం, మైస శేఖర్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



