viswatelangana.com
Date of Publish : 17 January 2024, 3:53 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన
featured

జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పపల్లి గ్రామంలో పోలీస్ కళా బృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు,గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు,సైబర్ మోసాలు,నివారణ పై అవగాహణ,సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.కోరుట్ల సి ఐ ప్రవీణ్ మాట్లాడుతూ నేను సైతం అనే కార్యక్రమం ద్వారా  పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని  గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని వల్ల గ్రామంలో  ఏ సంఘటన జరిగిన వెంటనే  తెలుస్తోంది అని తెలిపారు,సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించాలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు  పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు ,యూత్ చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయసహకారాలు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని,లైసెన్స్  లేకుండా వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్  ఆవశ్యకత గురించి వివరించారు.ఎస్సై పబ్బ కిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్  స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో  చిన్న చిన్న తగదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రతంత్రాలు మూఢ నమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యసలు ఉన్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై పబ్బ కిరణ్,గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Change News Type