జగిత్యాల

మే 13న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

viswatelangana.com

May 12th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13న కార్మికులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సురేంద్ర కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి విద్యార్థి విద్యావంతులు వైజ్ఞానికులు ప్రజలందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకొని దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలోనే ఉందని ఓటు వేయడం ద్వారా దేశ భవితవ్యాన్ని మార్చే అవకాశం కలదని కాబట్టి విధిగా తమ వంతు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు హితువు పలికారు. ఏదైనా వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Related Articles

Back to top button