సాయి జీనియస్ హై స్కూల్లో రెడ్ డే వేడుకలు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని సాయి జీనియస్ హై స్కూల్ లో రెడ్ డే ను పురస్కరించుకుని రెడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి జీనియస్ కరస్పాండెంట్ చౌకి రమేష్ మాట్లాడుతూ…. రెడ్ కలర్ లో ఉండే పండ్లు ఆపిల్, దానిమ్మ, చెర్రీ, స్ట్రాబెరీ అలాగే కూరగాయలు టమాటా, బీట్ రూట్ లలో లభించు విటమిన్స్, మినరల్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ గురించి తెలియజేశారు. ప్రతి దినము ఏదైనా ఒక పండును తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీజనల్ గా లభించే పళ్ళు చౌక గాను లభించి అనేక విటమిన్లు పోషకాలు అందిస్తాయని తెలుపారు. పువ్వులు గులాబీ, మందార, ఎర్ర రంగులు ఉండే పోస్ట్ బాక్స్, ఫైర్ ఇంజన్ వాటి యొక్క ప్రాముఖ్యత ప్రజలకు జరిగే ఉపయోగాల గురించి తెలియజేశారు. (ఇందులో భాగంగా విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అందరి ని అలరించాయి. ఇట్టి కార్యక్రమంలో కరస్పాండెంట్ చౌకి రమేష్, ప్రిన్సిపల్ చౌకి సుధ అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



