కథలాపూర్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

viswatelangana.com
August 24th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామానికి చెందిన దేశవేని లక్ష్మయ్య,మారంపల్లి వినోద్, చిన్న నర్సమ్మ లకు మండల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదప్రజలకు ఒక వరమని, మండలంలో మొత్తం 18 చెక్కులకు గాను 6 లక్షల 20 వేలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అద్యక్షుడు కాయితి నాగరాజు, పులి హరిప్రసాద్,వాకిటి రాజారెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, వేముల కృష్ణ, వెలిచాల సత్యనారాయణ, కూన అశోక్, తలారి మోహన్, పూండ్ర లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



