రాయికల్
విశ్వంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి

viswatelangana.com
August 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్షం దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థులు విశ్వంపై అవగాహన పెంచుకోవాలని, గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు వంటి వాటిపై పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని స్మరించుకుంటూ.. విద్యార్థులకు చిత్రలేఖనం పోస్టర్ తయారీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు అయిత పద్మ, ఏనుగు రజిత, జి.తరంగిణి, ఉపాధ్యాయులు జి.రాజేశం, పి.రాజశేఖర్, చెరుకు మహేశ్వర శర్మ, కె.ప్రశాంత్, అర్షియాఫర్హీన్ తదితరులు పాల్గొన్నారు.



