రాయికల్

సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

viswatelangana.com

March 25th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించి తోటి వ్యక్తుల ప్రాణాలను కాపాడి ప్రాణ దాతలు కావాలని కరీంనగర్, నగునూరు ప్రతిమ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సూర్య అన్నారు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమ్ ఎయిడ్ హెల్త్ నర్సింగ్ కోర్స్, టైలరింగ్,ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతి, యువకులకు రాయికల్ పట్టణంలో గల చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో సి.పి.ఆర్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ సూర్య,ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.మహేష్ మాట్లాడుతూ… రోడ్డు పై వాహనాలు నడిపే క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాహన దారులు ప్రమాదాలు జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించి 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వాలని, సకాలంలో దగ్గరలోని హాస్పటల్ కి తరలించి ప్రాణాలను కాపాడాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులకు, అకస్మాత్తుగా గుండె పోటు వచ్చినప్పుడు ప్రథమ చికిత్సగా ప్రతి ఒక్కరికి సి.పి.ఆర్ పైన అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్లు నాగిరెడ్డి రఘుపతి, శ్యామల, పలు కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతీ, యువకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button