కథలాపూర్

సిరికొండ సింగిల్ విండో చైర్మన్ గా జీవన్ రెడ్డి

viswatelangana.com

February 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కందరి జీవన్ రెడ్డి మంగళవారం ఎన్నికయ్యారు. సింగిల్ విండో ఎన్నికలు జిల్లా సహకార అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికోసం ముగ్గురు సింగిల్ విండో డైరెక్టర్లు నామినేషన్లు వేశారు. కందరి జీవన్ రెడ్డికి 9 మంది డైరెక్టర్లు మద్దతు తెలిపారు. మిగతా అభ్యర్థికి నలుగురు మాత్రమే మద్దతు ప్రకటించారు. దీంతో సింగిల్ విండో చైర్మన్ గా కందరి జీవన్ రెడ్డి ఎన్నికైనట్లు అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. అనంతరం డైరెక్టర్లు సంబరాలు జరుపుకున్నారు.

Related Articles

Back to top button