సీజనల్ వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి – మున్సిపల్ కమిషనర్ రవీందర్

viswatelangana.com
ఒక మార్పు – అభివృద్దికి మలుపు 100 రోజుల ప్రణాళికలో భాగంగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ పట్టణంలోని పలు వార్డులో వర్షాకాలం దృశ్య సీజనల్ వ్యాధుల రాకుండా దోమల నివారణ కొరకు మురికి కాల్వల పై స్ప్రే చేయడాన్ని అలాగే వార్డులలో ఖాళీ ఉన్న కుండీలలో నిల్వ ఉన్న నీరును తొలగించటాన్ని టైర్ పంచర్ల దుకాణాలలో టైర్లలో ఉన్న నీటిని తొలగించడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ… దోమల బెడదను నివారించేందుకు ప్రజల సహకారం అత్యవసరం అని తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు వార్డులలో తనిఖీలు నిర్వహించిన సందర్భముగా అనేక ఇళ్ల వద్ద పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీటి కుండీలు వాటిలో నీరు నిలిచిపోయి దోమల లార్వా వృద్ధికి అనుకూలమైన వాతావరణం నెలకొందని గుర్తించారు. కూలర్లు, కుండీలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి కుండీలలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి మీ ఇంటిలో ఉండే టైర్లలో, కూలర్లలో, నీటి తొట్టెలలో, డ్రమ్ములలో, పూల కుండీలలో నీరు నిలవకుండా శుభ్రం చేసుకోవాలి మీ పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంక్రమించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, అశోక్, పర్యవేక్షక అధికారులు, వార్డ్ ఆఫీసర్లు అలాగే పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.



