రాయికల్
నీటి సమస్యపై ఎమ్మెల్సీకి వినతి పత్రం

viswatelangana.com
March 12th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామ ప్రజలు గ్రామంలో సాగునీరు మరియు త్రాగునీరు సమస్యను కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ టి జీవన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించగా ఎమ్మెల్సీ వెంటనే స్పందించి డి 53 1L 7R మరియు 8R కెనాల్ ద్వారా చింతలూరు మోతుకుల కుంటలో నీరు నింపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వచ్చే విడత ద్వారా మోతుకులకుంటను నింపుతామని అధికారులు తెలపడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ భూపతిపూర్ సింగిల్ విండో డైరెక్టర్ అంజిత్ కాంగ్రెస్ నాయకులు బానోత్ రమేష్ నాయక్ ముంజం రాజు అనుపురం సుధాకర్ ముద్దం రమేష్ రమణయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు



