సురక్షిత ప్రయాణంతో ప్రజల విలువైన ప్రాణాలను కాపాడండి: డీఎస్పీ శ్రీరాములు

viswatelangana.com
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సురక్షిత ప్రయాణం” అనే కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు మెట్పల్లి డి.ఎస్.పి శ్రీరాములు కోరుట్ల మరియు మెట్పల్లి పరిధిలోని ఎన్.హెచ్ 63 రోడ్డుపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నా ప్రాంతాలను సందర్శించి బ్లాక్ స్పాట్ అయినా కోరుట్ల ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్, నంది చౌరస్తా, కోరుట్ల బస్టాండ్ ప్రాంతం, మాదాపూర్ ఎక్స్ రోడ్, గుమలాపూర్ వెంకటాపూర్ విలేజ్ ఎక్స్ రోడ్, మోహన్ రావు పేట్ ఎక్స్ రోడ్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ టెంపుల్, సురభి రైస్ మిల్, డాంబర్ ప్లాంట్, పీఎన్ఆర్ గార్డెన్ ప్రాంతాల మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్ లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటుకు తగు సూచనలు ఇచ్చారు. అలాగే మున్సిపల్, ఆర్ అండ్ బి మరియు నేషనల్ హైవే అథారిటీలతో సమన్వయం చేసుకొని, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, ప్రజల విలువైన ప్రాణాలను కాపాడాలని ఆదేశాలు ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై రామచంద్రం, మేడిపల్లి ఎస్ఐ శ్యామ్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారని కోరుట్ల సిఐ సురేష్ బాబు తెలిపారు.



