రాయికల్
0-5 సంవత్సరంల పిల్లల బరువు ఎత్తు మేళ

viswatelangana.com
June 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో 20-6- 2024 నుండి 30-06-2024 వరకి సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల బరువులు ఎత్తుల మేళలో భాగంగా ఈరోజు ఇటిక్యాల్ ఐదవ అంగన్వాడి కేంద్రంలో 0 నుండి 5 సంవత్సరాల పిల్లల బరువుల ఎత్తుల మేల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలను బరువులు ఎత్తులు కొలిచి వాళ్ళ యొక్క స్థితిని తల్లులకు తెలియజెసి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇటిక్యాల సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ పద్మావతి అంగన్వాడి టీచర్లు పార్వతి సువర్ణ సహారా సుజాత బుజ్జమ్మ అనురాధ మరియు ఏఎన్ఎం రజిత ఆశా కార్యకర్తలు సుమలత వనిత లక్ష్మి, అనురాధ రమాదేవి మరియు గర్భిణీలు బాలింతలు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు



