రాయికల్
సేంద్రీయ వ్యవసాయ సాగు శిక్షణ లో ఇటిక్యాల వాసి

viswatelangana.com
April 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రైతు పంటను పండించేటప్పుడు అనేక కష్టనష్టాలవోర్చి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతులలో ఆత్మస్థైర్యం పెంచి లాభసాటి వ్యవసాయం చేసేందుకు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు తెలంగాణప్రభుత్వం అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు గడ్డం రాజేందర్ రెడ్డి ని ఎంపిక చేయగా, ఆయన ప్రస్తుతం రాజస్థాన్ మౌంట్ అబ్ లో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చరవాణి ద్వార మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంతో రైతులకు లాభసాటి పంటను చూపిస్తూ, రైతుల రోజువారి శ్రమలో ఒత్తిళ్లను తట్టుకునేందుకు ప్రత్యేక యోగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.



