రాయికల్
రక్తదాన ఉద్యమంలో ఆపద్బాంధవులుగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా ఈ – పంచాయతీ ఆపరేటర్లు

viswatelangana.com
May 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపెట్ గ్రామానికి చెందిన వినీత్ అనే యువకునికి గాయత్రి హాస్పిటల్ లో అత్యవసర పరిస్థితుల్లో O పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరం అని డాక్టర్స్ సూచించారు. సమాచార మద్యమం ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రాణ దాతల సమూహం ఆత్మీయ సోదరుడు చిలువేరి ప్రశాంత్ స్వచ్చందంగా వెంటనే స్పందించి భారతి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేసి ప్రాణ దాతగా నిలిచారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలిచిన ప్రశాంత్ ని పేషెంట్ బంధువులు సామాజిక సేవకులు భారతి బ్లడ్ బ్యాంక్ టెక్నిషియన్ మంజూర్ బాయ్ తెలంగాణ ప్రాణదాతల సమూహం అడ్మిన్ మహమ్మద్ బాబుజాన్ భాయ్ తదితరులు అభినందించారు. ఈ వేసవి కాలం లో రక్తం కొరత చాలా ఉంటుంది. దయచేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయండి ప్రాణ దాతలుగా చరిత్రలో నిలవండి.



