జగిత్యాల
మీకు, మీ పార్టీకి ఓ దండం: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్

viswatelangana.com
October 22nd, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
తన అనుచరుడి హత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపై ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ‘మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇంతకాలం మానసికంగా అవమానాలకు గురవుతున్నా మేం భరించాం. మమ్మల్ని ఇలాగైనా బతకనివ్వండి. ప్రజలకు సాయం చేయాలనుకుంటే ఎన్జీవో పెట్టుకొంటాం’ అని అన్నారు. కొంతకాలం క్రితం ఆయన పార్టీ మారతారని ప్రచారం జరగడం తెలిసిందే.



